Friday, March 14, 2025
Homeజిల్లాలుఅనంతపురంకమ్యూనిస్టుల బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును కాపాడుకుందాం

కమ్యూనిస్టుల బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును కాపాడుకుందాం

ప్రైవేటీకరణకు నిలుపుదలకు చంద్రబాబు స్పందించాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ డిమాండ్

విశాలాంధ్ర -అనంతపురం : కమ్యూనిస్టుల బలిదానాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ నిలుపుదలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక టవర్ క్లాక్ వద్ద విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ మాట్లాడుతూ… 32 మంది బలిదానాలతో స్థాపించిన సంస్థ, కమ్యూనిస్టుల రాజీనామాలు, నాడు ఇందిరాగాంధీ స్పందనతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మూడోమారు మోడీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రైవేటీకరణకు పూనుకోవడం, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షమంది ఉద్యోగ ఉపాధి, రెండు లక్షల కోట్ల ఆస్తులు, విదేశీ కంపెనీలు మిట్టల్, పోస్కో కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. 1700 రోజులుగా ఉద్యమం, విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ డిమాండ్ మేరకు నరేంద్ర మోడీ స్పష్టత ఇవ్వాలన్నారు. సొంత
ఇనుప ఖనిజం గనులు ఉన్న ప్రతి స్టీల్ ప్లాంట్ కు ఖనిజం తవ్వడానికి టన్నుకు రూ.600 ఖర్చు అవుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ టన్ను తవ్వడానికి మార్కెట్లో రూ.8 వేలు ఖర్చు వస్తుందన్నారు. సంవత్సరానికి 3,500 కోట్ల అదనంగా ఖర్చు అవుతుందని, దీనిని నష్టంగా చూపించి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ఏపీ ప్రభుత్వం చంద్రబాబు, బీహార్ నితీష్ కుమార్ సహకారంతో కేంద్ర ప్రభుత్వం నడుస్తోందన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకుని వచ్చి ఎన్నికల ముందు విశాఖ కార్మికులకు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాన్ని నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు పి. నారాయణస్వామి, సి. మల్లికార్జున, కార్యదర్శి వర్గ సభ్యులు, జె. రాజారెడ్డి ,ఎన్ .శ్రీరాములు, చేతివృత్తుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి. లింగమయ్య, ఏపీ మహిళా సమైక్య ఏ .పద్మావతి, అనంతపురము నగర సహాయ కార్యదర్శులు, బి. రమణయ్య ,కె. అల్లిపీర, అఖిలభారత యువజన సమాఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, సంతోష్ కుమార్,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, హనుమంతు ,కుల్లాయి స్వామి, మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు, పార్వతీ ప్రసాద్, సిపిఐ నాయకులు ఈశ్వరయ్య, ఎల్లుట్ల నారాయణస్వామి, ఎఐటియుసి నగర అధ్యక్ష కార్యదర్శులు చిరంజీవి ,కృష్ణుడు, సుందర్ రాజు, మున్నా, ఇన్సాఫ్ నగర కార్యదర్శి, ఖాజహుస్సేన్, ఖాజా మొహిదీన్, ఏఐఎస్ఎఫ్ ఆంజనేయులు, నరసింహ యాదవ్, అఖిలభారత యువజన సమైక్య, నగర అధ్యక్షులు ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు