Monday, April 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబిజెపి పాలన నుంచి దేశాన్ని కాపాడుకుందాం

బిజెపి పాలన నుంచి దేశాన్ని కాపాడుకుందాం

ఆర్ ఎస్ పి 85 వ ఆవిర్భావ దినోత్సవం

ఆర్ఎస్పి పార్టీ ధర్మవరం నియోజకవర్గం కన్వీనర్ దాసర్ నరసింహులు

విశాలాంధ్ర ధర్మవరం:: బిజెపి పాల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని ఆర్ ఎస్ పి పార్టీ ధర్మవరం నియోజకవర్గ కన్వీనర్ దాసరి నరసింహులు ఈ సందర్భంగా ఆర్ ఎస్ పి 85 వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ధర్మవరం నగరంలోని శారద నగర్ బేధా బుడగ జంగం కాలనీలో రేవలేషనరీ సోషలిస్ట్ పార్టీ 85వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా కేక్ కటింగ్ చేశారు. అనంతరం రెవలేషనరి సోషలిస్ట్ పార్టీ ధర్మవరం మండల మండల కన్వీనర్ దాసరి నరసింహులు , ప్రగతి శీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంజుల నరేంద్ర మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తెచ్చిన సవరణ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఏ దేశంలో లేనన్ని కులాలు మతాలు భారతదేశంలో వున్నాయి అని,. ఇలాంటి దేశంలో బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లాంటి మతోన్మాదుపార్టీ లు దేశంలో ప్రజల యొక్క ఐక్యతను దెబ్బతేసేవిధంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి తరుణంలో దేశంలో మతసమారష్యాన్ని,సమగ్రతను,సౌబ్రాతృత్వాన్ని కాపాడుకోవాలంటే బిజెపి ప్రభుత్వం తెచ్చిన పురసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు. అదేవిధంగా దేశంలో ఆర్ఎస్పీ పార్టీ గత 56 సంవత్సరాలుగా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల సమస్యల పైపోరాడుతుందన్నారు. భవిష్యత్తులో ప్రజల సమస్యల పైన నిరుద్యోగ సమస్యల పైన రాజీలను పోరాటాలలో ముందు ఉంటామని తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వినయ్ కుమార్ ఈబుధి కుల్లాయప్ప, ఆర్ఎస్పి పార్టీ నాయకులు రాందాస్, చంద్ర, బయన్న,ఆర్ఎస్పి పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం పి ఎస్ యు నాయకులు భార్గవ్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు