— అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి
విశాలాంధ్ర -అనంతపురం : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకాన్ని అందరూ సద్వినియోగం చేసుకుందామని అదనపు ఎస్పీ డి.వి.రమణమూర్తి పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాలతో స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో ఈ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా విద్యుత్ శాఖ అధికారులు సూర్యఘర్ ముఫ్త్ బిజ్లి యోజన పథకం గురించి పోలీసు సిబ్బందికి అవగాహన చేశారు. ఈసందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ…ఇది ఎంతో మంచి పథకం అని, దీని ద్వారా రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాఫ్ నిర్మించుకోవాలన్నారు. దీనివల్ల విద్యుత్ బిల్లు తగ్గించుకోవచ్చన్నారు. అనంతరం … జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన సోలార్ రూఫ్ టాప్ కౌంటర్లను అదనపు ఎస్పీలు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయా కంపెనీల వారు డెమో నిర్వహించి పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, అనంతపురం రూరల్ డీఎస్పీ టి.వెంకటేష్, ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వర్ రెడ్డి, జిల్లా పోలీసు కార్యాలయం పరిపాలనాధికారి రవిరాం నాయక్, సి.ఐ లు విశ్వనాథ్ చౌదరి ( ట్రాన్సుకో), హరినాథ్, ఆర్ ఐ లు రెడ్డెప్పరెడ్డి, మధు, ఈఈ జెవీ రమేష్, డి.ఈ రామకృష్ణ, ఏ.డి లు శ్రీనివాసులు, చంద్రశేఖర్ జేవి రమేష్, ఎస్పీ సిసి ఆంజనేయప్రసాద్, డిపిఓ సూపరింటెండెంట్లు ప్రసాద్ , సావిత్రమ్మ, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు గాండ్ల హరినాథ్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.