పలువురు ప్రశంసలు వెల్లువ
విశాలాంధ్ర ధర్మవరం;; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి నెల నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం పట్ల విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇకనుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఇది ఒక వరంలాగా మారిందని, ఆకలి బాధలు తప్పను ఉన్నాయని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయడం ఎంతో సంతోషాన్ని ,తృప్తిని ఇచ్చిందని తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 22 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 6,220 మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఇటీవల ఉచితంగా పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు అందజేయడం, ఇప్పుడు విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకొని చదువుతోపాటు వారి ఆకలిని తీర్చేందుకు మధ్యాహ్న భోజన పథకం నిర్వహించడం అభినందించదగ్గ విషయమని తెలిపారు. దీంతో పేద విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేయడం ఒక శుభ సూచకమని తెలుపుతున్నారు.
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం శుభదాయకం
RELATED ARTICLES