Friday, January 3, 2025
Homeజిల్లాలుకర్నూలుమాదాసి కురువలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలి

మాదాసి కురువలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మాదాసి, మాదారి కురువలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలంటూ మంగళవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆనంద్ చైతన్య మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు మహాదేవ మాదిగ మాట్లాడుతూ బీసీ జాబితాలో ఉన్న మాదాసి, మాదారి కురువలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఎలా ఇస్తారని వారు ప్రశ్నించారు. జిల్లాలో మాదాసి, మాదారి కురువలు అసలు లేరన్నారు. మాదాసి, మాదారి కురువ పేరుతో గ్రామాలలో ఎలాంటి సామాజిక వివక్షకు గురికాని బీసీ (బి) వరుస సంఖ్య 11లో ఉన్న కురుబలు అక్రమంగా కుల ధృవీకరణ పత్రాలు పొంది ఎస్సీ కులగణన జాబితాలో వారి పేర్లు నమోదు కావడంతో ఎస్సీ వర్గీకరణ నిర్వీర్యమై ఎస్సీ 59 ఉప కులాలకు తీరని అన్యాయం జరుగుతుందని వారు మండిపడ్డారు.ఎస్సీ ఉపకులాలపై నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జే. సి. శర్మ ఏకసభ్య కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో మాదాసి, మాదారి కురువలు లేరని 2020 లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ వారికి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని జీఓ ఇవ్వడం విచారకరమన్నారు. తక్షణమే కులగణన జాబితా నుంచి మాదాసి, మాదారి కురువలను తొలగించాలని, జాబితాలో తప్ఫులను సరిదిద్దేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని, ఉప కులాల అభ్యంతరాల స్వీకరణకు మరో పది రోజులు గడువు పెంచాలని డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ శ్రీనాథ్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల నాయకులు జంబన్న, చిన్న రాముడు మాదిగ, సంసోను మాదిగ, శాంతిరాజు మాదిగ, దేవదాసు మాదిగ, సలోమోను మాదిగ, మార్కు మాదిగ, జైపాల్ మాదిగ, నాగేష్ మాదిగ, బొజ్జప్ప మాదిగ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు