ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని స్థానిక కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ” మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి”ని రాజనీతి శాస్త్ర ఉపన్యాసకులు డా. బి. గోపాల్ నాయక్ ఆధ్వర్యంలో కళాశాల ప్రిన్సిపాల్ డా.కె. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. కె. ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావ్ ఫూలే సత్యశోధక్ సమాజ్ ద్వారా అణగారిన వర్గాల అభ్యున్నతికోసం, ప్రజల సమాన హక్కులకోసం ఉద్యమించిన సంఘ సంస్కర్త , సామాజికవేత్త అని తెలిపారు. అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన తో పాటు మహిళోద్ధరణ కు కృషి చేసి, మొట్ట మొదటగా స్థానికంగా బాలికల కోసం పాఠశాల లు ప్రారంభించిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్, డా ఎస్. చిట్టెమ్మ, ఎ. కిరణ్ కుమార్, డా ఎస్. షమీఉల్లా, ఎస్.పావని, ఎం.భువనేశ్వరి, వి.హైమావతి ,ఎం. పుష్ప, టి.సరస్వతి, బి . ఆనంద్, జి.మీనా, జి. ధనుంజయ…. తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
కె.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి వేడుకలు..
RELATED ARTICLES