Saturday, March 15, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలం

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలం

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి, ఆసుపత్రి కమిటీ మెంబర్ డాక్టర్ నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం:: పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మాధవి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ నరసింహులు, గూండా పుల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛ ఆంధ్రకార్యక్రమాన్ని నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది కలిసి ఆవరణంలోని చెత్తాచెదారాన్ని పరిశుభ్రం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత శుభ్రంగా ఉన్నప్పుడే ఎటువంటి రోగాలు దరి చేరవని తెలిపారు. కావున ప్రతి శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు