Thursday, April 17, 2025
Homeజిల్లాలుఅనంతపురంఒక చుక్క నీరు కూడా వృధా కాకుండా చూసుకోవాలి

ఒక చుక్క నీరు కూడా వృధా కాకుండా చూసుకోవాలి

గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు

జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర అనంతపురం : గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ఒక చుక్క నీరు కూడా వృధా కాకుండా ప్రజలు చూసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పిలుపునిచ్చారు.
అనంతపురం నగరంలోని ఆల్ ఇండియా రేడియో స్టేషన్ లో గురువారం ఉదయం 7:45 గంటల నుంచి 8:15 గంటల వరకు నిర్వహించిన ఆకాశవాణి అనంత మిత్ర ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీటి సమస్యలపై నేరుగా ప్రజలకు జిల్లా కలెక్టర్ సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఫోన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు పలు సమస్యలను తెలియజేయగా, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో తాగునీటి సమస్యల పరిష్కారం నిమిత్తమే ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సాగులో ఎంత నీరు అవసరమైతే అంత నీరు మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించారు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టంని కూడా పాటించి నీటి వృధాని అరికట్టాలన్నారు.

ఈ సందర్భంగా ఫోన్ ద్వారా పామిడి మండలం పి.కొండాపురం గ్రామం ఎస్సి కాలనీకి చెందిన నరేష్ మాట్లాడుతూ ఎస్సి కాలనీలో 350 కుటుంబాలు ఉన్నాయని, చిన్న వయసులోనే ఫ్లోరైడ్ వల్ల కాళ్లు వంకర్లు పోతున్నాయని, మినరల్ వాటర్ ప్లాంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, పామిడి నుంచి ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొచ్చి ఒక బిందె పది రూపాయలకు అమ్ముతున్నారని, పంచాయతీ వాటర్ మూడు రోజులకు ఒకసారి వస్తోందని, ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి పర్యటన చేసి సమస్యను పరిష్కరిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా 15 మంది ఫోన్ ద్వారా పలు రకాల సమస్యలను జిల్లా కలెక్టర్ కు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ఆర్.సురేష్, జడ్పి సిఈఓ రామచంద్రారెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ బాలరాజు, ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు