Thursday, February 20, 2025
Homeఆంధ్రప్రదేశ్ఈ నెల 24న తాడేపల్లి లో బి కెఎం యు ధర్నాను జయప్రదం చేయండి

ఈ నెల 24న తాడేపల్లి లో బి కెఎం యు ధర్నాను జయప్రదం చేయండి

మెటీరియల్ కాంపోనెంట్ ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి

జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి డిమాండ్ విశాలాంధ్ర అనంతపురం ఈ నెల 24న తాడేపల్లి లోని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తలపెట్టిన ధర్నాను జయప్రదం చేయాలని, మెటీరియల్ కాంపోనెంట్ ను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి కేశవరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేంద్ర బడ్జెట్ లో కూడా అరకొర నిధులు కేటాయిస్తూ ఈ చట్టాన్ని ఎత్తివేసేందుకు కుట్రలు పన్నుతోందన్నారు . రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇతర ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ ఈ ఉపాధి హామీ నిధులను వాడటంవల్ల లేబర్ కాంపోనెంట్ నిధులను తగ్గించడం జరుగుతోందన్నారు. మెటీరియల్ కాంపోనెంట్లో జరుగుతున్న పనుల్లో కూడా ఉపాధి హామీ కూలీలతోనే పనులు చేయించాలని చట్టంలో పొందుపరిచినప్పటికీ అలా జరగడం లేదన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఉపాధి హామీలో కూలిరేట్లు, వ్యవసాయ పని దినాలు తగ్గడం వలన ఉపాధి పని దినాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు కల్పించి, వలసలు పాపాలన్నారు. కుటుంబ జాబ్ కార్డ్ నిమిత్తం లేకుండా ప్రతి వయోజనుడికి విడిగా జాబ్ కార్డు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. పని అడిగిన వారికి 200 రోజులు పని దినాలు కల్పించి వారికి రోజు కూలి రూ.700 ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రూపుకి పని కల్పించాలని, పని కల్పించకపోతే ఃఉపాధి భృతిఃగా సంవత్సరంలో ప్రతికూలీకి రూ.12 వేలు ఇవ్వాలన్నారు. ఉపాధి హామీలో కాంట్రాక్టర్లను, యంత్రాలను నిషేధించాలి. వందరోజులు పని పూర్తి చేసుకున్న ప్రతి గ్రూప్కు పథకంలో చూపెట్టిన విధంగా ఉపాధి కూలీలకు పనిముట్లు కల్పించాలన్నారు. పని ప్రదేశాలలో టెంట్లు, మెడికల్ కిట్లు, మజ్జిగ సరఫరా చేయాలన్నారు. రెండు పుటలా పని విధానం తీసివేసి సమ్మర్ అలవెన్స్ పునరుద్ధరణ చేయాలన్నారు. మేట్ల వ్యవస్థ తీసుకువచ్చి వారికి గుర్తింపు కార్డులు అందజేసి రోజుకు ఐదు రూపాయలు పారితోషికం ఇప్పించాలన్నారు. చేసిన పనికి పే స్లిప్పులు ఇచ్చి పోస్టాఫీస్ ద్వారా వారంలో బిల్లులు చెల్లించాలన్నారు పాత బకాయిలు తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా పని ప్రదేశంలో ప్రమాదాల్లో మరణిస్తే 10 లక్షలు ఎక్స్రేషియో ఇవ్వాలని, వడదెబ్బ, గాయాల పాలైతే మెరుగైన ఆరోగ్య సేవలు అందించి, కోలుకునేవరకు ఉపాధి వేతనం చెల్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఉపాధి హామీలో పనిచేసే క్షేత్రస్థాయి సిబ్బందిపై రాజకీయ పక్షపాతాలు లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ఉపాధి పనులపై ప్రతి గ్రామంలో మైక్ ప్రచారం చేసి గ్రామ సభల్లో పనులు ఎంపికచేసి బహిరంగంగా తెలియజేయాలన్నారు. మండల స్థాయిలో వ్యవసాయ కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాలు తప్పకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు. తదితర సమస్యల పరిష్కార సాధనకై ఈనెల 24న తాడేపల్లి లో జరుగు ధర్నాకు కూలీలంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు