ఆర్గనైజర్స్ బోనాల శివయ్య, బీరే శ్రీరాములు
ధర్మవరం;; పట్టణములోని పెనుజూరు కాలనీ నూతన ప్రభుత్వ హాస్పిటల్ పక్కనగల మెహర్ బాబా సెంటర్ యందు ఈనెల 25వ తేదీ రక్త దాన శిబిరమును ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్గనైజర్లు బోనాల శివయ్య, బీరే శ్రీరాములు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరం డాక్టర్ మారు జ్ఞాపకార్థం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కీర్తిశేషులు డాక్టర్ మారు 6 దశాబ్దాల సేవ చరిత్రలో వేలమంది పోలియో బాధితులకు ఉచిత శాస్త్ర చికిత్సలను అందించడం జరిగిందని, మహిళల అభ్యున్నతిని కోరుకుంటూ నోరు మంది నిరుపేద బాలికలకు నర్సు శిక్షణ అందించడం జరిగిందని తెలిపారు. డాక్టర్ మారు సేవలు ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా విస్తృతంగా గిరిజన ప్రాంతాలలో మూఢనమ్మకాల నిర్మూలనకు కూడా కృషి చేయడం జరిగిందని తెలిపారు. డాక్టర్ మారు తండ్రి ఘోర సాంస్కృతిక వారసురాలిగా తన సేవా కార్యక్రమాలలో గొప్ప విజయమును సాధించడం జరిగిందని తెలిపారు. అందుకే వీరి సేవలను ధర్మవరం స్వచ్ఛంద సంస్థలు కొనియాడుతూ రెడ్ క్రాస్, ఎన్జీవోల సహాయముతో ఈ రక్తదాన శిబిరమును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరా నిర్వాహకులుగా 11 స్వచ్ఛంద సంస్థలు పాల్గొంటున్నాయని తెలిపారు. కావున రక్తదానం చేయువారు అధిక సంఖ్యలో పాల్గొని, శిబిరాన్ని విజయవంతం చేయాలని వారు తెలిపారు.
రక్తదాన శిబిరమును జయప్రదం చేయండి..
RELATED ARTICLES