ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపు
విశాలాంధ్ర -అనంతపురం :8 న హార్టికల్చర్ రాష్ట్ర సదస్సు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సమితి,, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్, రాష్ట్ర రైతు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు ఏ కాటమయ్య రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్ ప్రకటించిందన్నారు. వెనుకబడిన, కరువు పీడిత ప్రాంతంగా ఉన్న ఉమ్మడి అనంతపురము జిల్లాలో మామిడి, అరటి, చీనీ, బత్తాయి, దానిమ్మ, టమాట, మిర్చి, కూరగాయలు, పూలు తదితర పంటలకు కేంద్రంగా ఉంది అన్నారు. రాష్ట్రంలో ఉద్యాన పంటలకు అనువైన భూములు, కష్టపడి పండించే రైతులు ఉన్నా సాగునీటి వనరులు కరువైందన్నారు. రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సి.మల్లికార్జున మాట్లాడుతూ…
90శాతం వరకు సబ్సిడీతో మైక్రోఇరిగేషన్ పథకాలు అందించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నా కరువుసీమలో జలసిరి పథకం ద్వారా అవసరమైన రైతులందరికీ 800 అడుగుల వరకు ఉచితంగా బోర్లు వెయ్యాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యాన రైతుల సమస్యలను చర్చించేందుకు ఈ సదస్సు ఈనెల 8 న స్థానిక జిల్లా పరిషత్ హాల్లో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షులు ఎం. పి సంతోష్ కుమార్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కే వి వి ప్రసాద్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి జగదీష్, పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్, రాష్ట్ర రైతు సంఘం నిర్వాహక అధ్యక్షులు ఏ కాటమయ్య, జిల్లా పండ్లతోట రైతు సంఘం అధ్యక్షులు అనంత రాముడు పాల్గొనడం జరుగుతుందన్నారు. జిల్లాల నుండి ఉద్యాన రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏ జిల్లా సహాయ కార్యదర్శి పి. నారాయణస్వామి, సింగనమల నియోజకవర్గం కార్యదర్శి పి నారాయణస్వామి, రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి పి రామకృష్ణ, సిపిఐ, రైతు సంఘంబండి రామక్రిష్ణ రమేష్ చలపతి నాయకులు పాల్గొన్నారు.