రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రగతిశీల విద్యార్థి సంఘం నాలుగవ జాతీయ మహాసభలు కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రంలో మే నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జాతీయ మహాసభలు నిర్వహించడం జరుగుతుందని, ఈ సభలను విజయవంతం చేయాలని పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని బీసీ హాస్టల్ నందు జాతీయ మహాసభల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన జాతీయవిద్యా విధానం ఏకపక్షంగా అమలు చేస్తుందనిఅన్నారు. ఈ కారణంగా ప్రభుత్వ విద్యా సర్వనాశనం అయ్యింది అని, అలాగే దేశంలో ని ప్రభుత్వ ఆస్తిని, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా అమ్మేస్తుంది అని దుయ్యబట్టారు. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ నుండి దేశాన్ని కాపాడుకోవాల్సిన భాద్యత దేశంలోని విద్యార్ధి, యువతపై వున్నదనిపేర్కొన్నారు. కావున ప్రభుత్వ విద్యను, దేశాన్ని కాపాడుకుందాం, నూతన జాతీయవిద్యా విధాన్ని రద్దు చేయాలనీ, దేశంలో బీజేపీ కి వ్యతిరేకంగా భవిష్యత్ ఉద్యమ ప్రణాళికను రూపొందించు కోవడానికి ఈ మహాసభలు వేదిక అవుతుందని తెలిపారు. దేశావ్యాప్తంగా అన్ని రాష్ట్రాలనుండి 950 మంది ప్రతినిధులు హాజరు అవుతున్నారని అన్నారు.అలాగే జీవో నెంబర్ 77 ను తెచ్చి పిజీ, ఎం బి ఏ, ఎం సి ఏ లాంటి ఉన్నత చదువులలు చదవాలనే పేద మధ్యతరగతి విద్యార్థులకు స్కాలర్షిప్స్ రావడానికి రాకపోవడానికి కారణమైన జీవోరద్దు చేయాలని డిమాండ్ చేశారు. 32మంది బలిదానం వల్ల సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేట్ పరంకాకుండా ఆపాలని కోరారు.విభజన హక్కు చట్టంలో పొందవలసిన విధంగా సెయిల్ ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మించడం వల్ల వెనుక బడిన రాయలసీమ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించి వలసలు ఆగుతాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో విద్యారంగా నిరుద్యోగ సమస్యల కోసం పిఎస్ యు చేసే పోరాటలకువిద్యార్థులు,నిరుద్యోగ యువత సిద్ధం కావాలని పిలుపునీచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నందకిషోర్, ప్రశాంత్, గిరీష్, మహేంద్ర, నరసింహ పాల్గొన్నారు.
పిఎస్ యు జాతీయ మహాసభలు జయప్రదం చేయండి
RELATED ARTICLES