ఏ పి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల మల్లికార్జున
విశాలాంధ్ర -అనంతపురం : ప్రతి గ్రామానికి త్రాగునీటి సాధనకై ఈనెల 22 నుండి 24 వరకు కడప నగరంలోజరుగు రాయలసీమ జిల్లా ల నెల్లూరు, ప్రకాశం జిల్లాల ప్రాజెక్టులు మహాసభ ను జయప్రదం చేయాలని ఆంద్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జున శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరువు వలసలు ఆత్మహత్యలకు నిలియంగా మారిన రాయలసీమ శాశ్వత విముక్తికి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పంట కాలువలకు పూర్తిగా నిధులు నీటి వివాదాలకు శాశ్వత పరిష్కారం ,నికర జలాలు కేటాయించాలన్నారు. ప్రతి గ్రామ పట్టణానికి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు, సాధించాలన్న లక్ష్యంతో మరో మారు ఉద్యమానికిసన్నధ్ధం చేసేందుకు కడపలో జరుగు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, నీటి ప్రాజెక్టుల మహాసభ జరుగుతుందన్నారు. కరువు సీమకు కృష్ణ జలాలే ఏకైక శరణ్యమని గతంలోనే రైతు సంఘాలు కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేశాయన్నారు. ఆ పోరాటాల ఫలితంగా హంద్రీనీవా, గాలేరు ,నగరి, ప్రాజెక్టులను తీసుకొని వచ్చారని కానీ నేటికీ ఈ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రాయలసీమ పేరు చెప్పి అన్ని ప్రాజెక్టుల ను పూర్తి చేస్తున్నామన్నారు. గాని రాయలసీమలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేదన్నారు
వరుస కరువుతో ఇబ్బందులు పడుతూ వేసిన పంటలు పండక అప్పులు ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు, ఆకలి చావుల, వలసలకు నిలయమైన
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3.45 లక్షల వేల ఎకరాలకు సాగునీరు అందించే హంద్రీనీవా ప్రాజెక్టును నిర్విర్యంచేసే ప్రయత్నం చేస్తున్నారని కాలువను 10వేల క్యూసెక్కులకు పెంచి సాగు భూములకు నీరు ఇవ్వకుండా ఇప్పుడు 2వ దశ కాలువకు లైనింగ్ చేయడానికి పూనుకున్నారన్నారు. కాలువకు లైనింగ్ చేస్తే జిల్లా రైతులమెడకు ఉరితాడు బిగించినట్లు అవుతుందన్నారు.
హంద్రీనీవా కాలవను వెడల్పు చేసి ఆయకట్టుకు నీరు ఇవ్వాలని రాయలసీమ జిల్లాలో ఉన్న అన్ని సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగునీరు ప్రతి గ్రామానికి త్రాగునీరు అందించే వరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పోరాటాలను నిర్వహించటానికి ఈ ప్రాజెక్టుల మహాసభ ను జయప్రదం చేయాలన్నారు. ఈ మహాసభకు అధికసంఖ్యలో రైతులు,రైతుకూలీలు,కౌలురైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.