Homeజిల్లాలుఅనంతపురంపురుగుల మందు సేవించి వ్యక్తి  మృతి..

పురుగుల మందు సేవించి వ్యక్తి  మృతి..

- Advertisement -

విశాలాంధ్ర బొమ్మనహల్.. మండలంలోని సింగేపల్లి గ్రామంలో  కురుబ మోహన్ (40)పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.  మోహన్ తరచూ మద్యం తాగి ఉన్న ఆస్తులను అమ్ముకున్నాడని, కుటుంబ సభ్యులు మద్యం మాని వేయాలని హెచ్చరించడంతో మనస్థాపానికి గురైన మోహన్ ఆదివారం పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న మోహన్ ను బళ్లారి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి లో ఛికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుని భార్య గీతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నబీరసూల్ తెలిపారు .

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు