Saturday, May 24, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఏపీటీఎఫ్ -257 ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీల హెల్ప్ లైన్ సెంటర్ నిర్వహణ

ఏపీటీఎఫ్ -257 ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీల హెల్ప్ లైన్ సెంటర్ నిర్వహణ

ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్.. బికే. ముత్యాలప్ప
విశాలాంధ్ర ధర్మవరం ; ప్రభుత్వ ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన ఆన్లైన్ నమోదు మరియు ఆన్లైన్ నమోదు లో వచ్చు సమస్యల పరిష్కరించేందుకు ఏపీటీఎఫ్-257 ఆధ్వర్యంలో ధర్మవరం ఎన్జీవో కార్యాలయము నందు హెల్ప్ లైన్ సెంటర్ ను రాష్ట్ర కౌన్సిలర్ బి కే ముత్యాలప్ప ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కే బలరాం, స్టేట్ కౌన్సిలర్ పి. శ్రీనివాసులు, జిల్లా ఆడిటర్ వై.నాగభూషణం, ధర్మవరం మండల అధ్యక్షులు కే. ఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి జి శివానంద, పట్టణ అధ్యక్షులుశ్రీనివాసులు, సీనియర్ కార్యకర్త లు బయన్న, శంకర్ నారాయణ, వాసు కుమార్, హేమంత్ కుమార్, గోపీనాథ్, శ్రీనివాసులు రెడ్డి, శంకర, లోకేష్, శివయ్య, రామకృష్ణ, కే.చంద్రశేఖర్, అన్నం చంద్రశేఖర్, పెద్ద ఓబులేసు, బాలు నాయక్, ఓబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి రోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటలవరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఈరోజు దాదాపు 100 మంది ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు అని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు