విశాలాంధ్ర -తనకల్లు : మండల పరిధిలోని బాలసముద్రం పంచాయతీ గోవింద వారి పల్లికి చెందిన వైసీపీ కార్యకర్త నారాయణప్ప అకాల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ అశోక్ వర్ధన్ రెడ్డి కదిరి వైసిపి సమన్వయకర్త మక్బూల్ అహ్మద్ ఆదేశాల మేరకు సంఘటన స్థలానికి చేరుకొని మృతునికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.