విశాలాంధ్ర -పామిడి (అనంతపురం జిల్లా) : పామిడి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించనున్నట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి తేజోష్ణ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని గ్రామ పంచాయితీల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఆయా శాఖల అధికారులు హాజరుకావాలని సూచించారు. ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. అధికారులు తమ అభివృద్ధి పనులకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరుకావాలన్నారు.