రెడ్ క్రాస్ సీనియర్ నాయకుడు డాక్టర్ సత్య నిర్ధారన్
విశాలాంధ్ర ధర్మవరం; వైద్య శిబిరాలు పేద ప్రజలకు వరంలాగా మారుతాయని రెడ్ క్రాస్ సీనియర్ నాయకుడు డాక్టర్ సత్య నిర్ధారన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆర్డిటి విన్సెంట్ ఫెర్రర్ 105వ జయంతి సందర్భంగా మండల పరిధిలోని ధర్మపురి గ్రామంలో గ్రామ సచివాలయ ఆవరణములో ఉచిత వైద్య శిబిరము నిర్వహించారు. అనంతరం డాక్టర్ సత్య నిర్ధారణతో పాటు ముఖ్యఅతిథి ప్రముఖ కవి టీవీ రెడ్డి, సోమల రాజు ఫౌండేషన్ ప్రతినిధి శ్రీధర్ మాట్లాడుతూ వినూత్నమైన ఆలోచనలతో ఇటువంటి శిబిరాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ శిబిరం నేడు వృద్ధులకు దివ్యాంగులకు త్రైమాసిక లో ఇవ్వడం శుభదాయకమన్నారు. ఈ శిబిరంలో 30 మంది రోగులకు వైద్య చికిత్సలను అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ దంపతులు జయరామిరెడ్డి, యువర్ ఫౌండేషన్ సభ్యులు కేతా లోకేష్, బ్లడ్ డొనేషన్ యాక్టివిస్టు శ్రీరాములు, గ్రామ సచివాలయ సిబ్బంది ఆరోగ్య కార్యకర్తలు, పాఠశాల హెడ్మాస్టర్ సౌభాగ్య లక్ష్మి, సోమల రాజు ఫౌండేషన్ శ్రీధర్, వన్నెల తదితరులు పాల్గొన్నారు.
వైద్య శిబిరాలు పేద ప్రజలకు వరం
RELATED ARTICLES