Monday, May 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిశ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై 3న సమావేశం

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై 3న సమావేశం

ఆలయ ఈవో వెంకటేశులు, అడ హక్ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం; మే నెలలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాల వేడుకల యొక్క ఏర్పాట్లపై ఈ నెల మూడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఆలయంలో సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటేశులు, ఆలయ అడహాక్ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించుటకే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సమావేశానికి ఉభయ దాతలు, సేవా కార్యకర్తలు, భక్తాదులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, ఆసక్తి గల పుర ప్రముఖులు పాల్గొని తమ యొక్క విలువైన సలహాలు సూచనలు తెలియజేయవలసినదిగా వారు తెలిపారు. బ్రహ్మోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లకు తగిన సన్నాహాలు కూడా ఏర్పాటు చేయుటకు ఈ సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు