Thursday, April 3, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎంఈఎఫ్ నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎంఈఎఫ్ నాయకులు

అనంతపురం జిల్లా
విశాలాంధ్ర – శెట్టూరు : కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోను ఏకగ్రీవ తీర్మానం చేయడం పట్ల మాదిగ ఉద్యోగుల సమాఖ్య నేతలు హర్షం వ్యక్తం చేశారు శుక్రవారం రాత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కేపీ నాగేష్,ఎంఈఎఫ్ నియోజకవర్గం అధ్యక్షుడు ఎర్రి స్వామి ప్రధాన కార్యదర్శి చిరంజీవి, మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లు పోరాడి సాధించిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాదిగ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరులకు నివాళి అర్పించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే విధంగా కేంద్రం తరఫున అఫిడవిట్ దాఖలు చేసి సహకరించిన భారత ప్రధాని నరేంద్ర మోడీ కి, ఈరోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్సీ ఉప కులాల జనాభా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను రాష్ట్ర యూనిట్ గా వర్గీకరించడంతో ఎస్సీ – ఏ గ్రూపుకు 1 శాతం, ఎస్సీ – B గ్రూపుకు 6.5 శాతం, ఎస్సీ – C గ్రూపుకు 7.5 శాతం ప్రకారంగా అవకాశాలు వస్తాయి. ఈ మేరకు ఎస్సీల్లోని అన్ని ఉపకులాలకు సమన్యాయం జరుగుతుందని అన్నారు. భవిష్యత్తులో 2026 జనాభా లెక్కల ఆధారంగా జిల్లా యూనిట్ వర్గీకరణ కూడా చేస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సలహాదారుడు పురుషోత్తం, లక్ష్మన్న, వాల్మీకి సంఘం ఉద్యోగుల ప్రధాన కార్యదర్శి వీరభద్ర, మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్, ఎమ్మార్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు