Wednesday, May 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమెగా రక్తదాన శిబిరంనకు విశేష స్పందన..

మెగా రక్తదాన శిబిరంనకు విశేష స్పందన..

తారక్ చేయూత చారిటబుల్ ట్రస్ట్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రంగా థియేటర్ ఆవరణములో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని తారక్ చేయుత చారిటబుల్ ట్రస్టు, జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షులు అంకె రామాంజనేయులు ఉపాధ్యక్షులు వెంకటేష్, తుకారాం, ముత్యాలు, రమేష్, నవ కుమార్, వేణుగోపాల్, గురునాథ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా ఈ మెగా రక్తదాన శిబిరమును నిర్వహించడం మాకెంతో ఆనందదాయకంగా ఉందని తెలిపారు. రక్తదానం చేసిన వారికి ఒక లక్ష రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కలదు అని వారు తెలిపారు. ఇప్పటికే తారక్ చేయుత చారిటబుల్ ట్రస్టు, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరానికి 44 మంది రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ రక్తదాన శిబిరం విజయవంతం చేసినందుకు పేరుపేరునా వారు కృతజ్ఞతలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు