Friday, February 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమెగా డీఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

మెగా డీఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి

విద్య శాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించాలి

రెడ్ బుక్ సృష్టించడం మాత్రమే కాదు

నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలి

ఏఐవైఎఫ్ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి సకల రాజా

విశాలాంధ్ర ధర్మవరం : రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగాలను మెగా డీఎస్సీ నిర్వహించి వెంటనే భర్తీ చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య జిల్లా కార్యదర్శి సకల రాజా పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న కలెక్టర్ కార్యాలయాల్లో, ఆర్డీవో కార్యాలయంలో,తహసిల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేయడం జరిగిందని అనంతరం వారుధర్మవరం పట్టణం సిపిఐ కాలనీ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతూ యువజన విద్యార్థి సంఘాలను పిలిపించుకొని మొదటి సంతకం డీఎస్సీ మీద నే పెడుతున్నానని చెప్పడం జరిగిందని, నూతన ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్న ఇప్పటివరకు మెగా డీఎస్సీ కాదు కదా మినీ డీఎస్సీ కూడా ఇవ్వలేదని వారు విమర్శించారు. రెడ్ బుక్ సృష్టించడం మాత్రమే కాదని ,నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని అన్నారు. అలాగే అమరావతిని ఫ్రీ జోన్ గా చేసి 26 జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ను కోరారు. రేపు జరిగే రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో నిరుద్యోగులకు పదివేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చేలా బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని వారుడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సునీల్ ,విజయ్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు