విశాలాంధ్ర -ధర్మవరం : మోడల్ స్కూల్ లో నిర్వహిస్తున్న ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని ఎంఈఓ గోపాల్ నాయక్ సందర్శించారు. అనంతరం విద్యార్థులు అందిస్తున్న వృత్తి విద్యా శిక్షణను కూడా వారు పరిశీలించారు. ఈ ఈ ఇంటర్నెట్ షిప్ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ షాప్ లో భాగంగా 18 మంది విద్యార్థులకు అందిస్తున్న ప్రాక్టికల్ శిక్షణ, కుట్టుపని, గార్మెంట్, డిజైనింగ్, ఇతర వృత్తి నైపుణ్యాల అభివృద్ధి గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు శిక్షణలో నేర్చుకుంటున్న నైపుణ్యాలను పరిశీలించి వారి అభ్యాస పురోగతిని కూడా సమీక్షించారు. విద్యార్థులు వృత్తి విద్యలో నైపుణ్యాలను పెంపొందించుకొని భవిష్యత్తులో స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వృత్తి నైపుణ్యాలు పెంపొందించడానికి అవకాశం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ పద్మశ్రీ, ఉపాధ్యాయులు చైతన్య లక్ష్మి, వృత్తి విద్యా శిక్షకులు రాజేశ్వరి పాల్గొన్నారు.
ఇంటర్న్ షిప్ కార్యక్రమాన్ని సందర్శించిన ఎంఈఓ గోపాల్ నాయక్
- Advertisement -
RELATED ARTICLES


