విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబలం, కల్లుకుంట, మేకడోన, కంబలదిన్నె, జాలవాడి, బసలదొడ్డి, హెచ్ మురవణి, పెద్దకడబూరు తదితర గ్రామాల్లో శుక్రవారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు ముస్లిం సోదరులు భక్తి శ్రధ్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రమైన పెద్దకడబూరులో పెద్ద మసీదు, చిన్న మసీదు వస్తాదులు రెహమాన్, ఫరీద్ ఆధ్వర్యంలో మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా గ్రామ పురవీదుల గుండా మక్కా మసీదు నమూనాలతో ర్యాలీ నిర్వహించారు. నారే తక్బీర్, అల్లాహు అక్బర్ నినాదాలు చేస్తూ జాతీయ జెండాను ఊరేగించి దేశభక్తి చాటారు. సర్వమానవాళికి ప్రవక్త శాంతి సందేశాన్ని ప్రసాదించారని సందేశమిచ్చారు. ముస్లీం సోదరులు అందరితో కలిసి మెలసి జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.


