Saturday, April 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పాలు, బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ

ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పాలు, బ్రెడ్, బిస్కెట్లు పంపిణీ

శ్రీ సత్య సాయి సేవ సమితి-2, సుబ్బదాసు భజన మందిరం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 200 మంది రోగులకు శ్రీ సత్య సాయి సేవ సమితి-2, పిఆర్టి వీధి సుబ్బదాసు భజన మందిరం నిర్వాహకులు పాలు, బ్రెడ్లు ,బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టపర్తి బాబా ఆశీస్సులతో, దాతల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. రోగులను ఆదుకోవుట, సేవ చేయటం లోనే నిజమైన సంతృప్తి ఉందని తెలిపారు. తదుపరి రోగులు సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి-2 వారు చేస్తున్న ఇటువంటి సేవలు ఎందరికో స్ఫూర్తినిస్తాయని తెలిపారు. సమాజ సేవ చేతిలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు