ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే వ్యవసాయ బడ్జెట్ ను రాష్ట్ర మంత్రి కింజరాప్ అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు, విత్తన రాయితీ పంపిణీకి రూ.240 కోట్లు, రైతులకు వడ్డీలేని రుణాల కింద రూ.250 కోట్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమలుకు రూ.9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు
RELATED ARTICLES