Friday, May 16, 2025
Homeఆంధ్రప్రదేశ్మెగా డీఎస్సీ గ‌డువు పొడిగింపుపై మంత్రి లోకేశ్ కీల‌క వ్యాఖ్య‌లు

మెగా డీఎస్సీ గ‌డువు పొడిగింపుపై మంత్రి లోకేశ్ కీల‌క వ్యాఖ్య‌లు

మెగా డీఎస్సీ ద్వారా ఏపీ ప్ర‌భుత్వం 16, 347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయ‌నుంది. ఇందుకు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ గురువారంతో ముగిసింది. జూన్ 6 నుంచి ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, ప్రిప‌రేష‌న్‌కు 90 రోజుల గ‌డువు ఇవ్వాల‌ని చాలా మంది అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ ప్ర‌క‌ట‌న చేసిన‌ప్ప‌టి నుంచి ఇదే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా ఈ డిమాండ్‌పై ఐటీ, విద్య‌శాఖల మంత్రి నారా లోకేశ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డీఎస్సీ ఆపేందుకు వైసీపీ సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. కొంద‌రు సమయం పెంచాలంటున్నారు. గతేడాది డిసెంబర్‌లోనే మేము సిలబస్ ప్రకటించ‌డం జ‌రిగింది. ఏకంగా ఏడు నెల‌లు గ‌డువిచ్చాంఁ అని ఆయ‌న‌ గుర్తు చేశారు. దీంతో మంత్రి లోకేశ్ వ్యాఖ్య‌ల‌తో మెగా డీఎస్సీ గ‌డువు పెంపున‌కు అవ‌కాశం లేద‌ని క్లారిటీ ఇచ్చ‌టిన‌ట్లైంది.

ఏపీ మెగా డీఎస్సీ 2025 పూర్తి షెడ్యూల్‌ ఇలా..
ఆన్‌లైన్‌ ఫీజుల చెల్లింపులు, దరఖాస్తుల స్వీకరణ తేదీలు: ఏప్రిల్‌ 20 నుంచి మే 15 వరకు
మాక్‌ టెస్ట్‌లు: మే 20 నుంచి
హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌ తేదీ: మే 30 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
ఏపీ డీఎస్సీ ఆన్‌లైన్‌ పరీక్షలు: జూన్‌ 6 నుంచి జులై 6 వరకు
ప్రాథమిక కీ విడుదల: అన్ని పరీక్షలు పూర్తయిన రెండో రోజే ప్రాథమిక కీ విడుదల
అభ్యంతరాల స్వీకరణ: ఆ తర్వాత ఏడు రోజులపాటు అభ్యంతరాల స్వీకరణ
ఫైనల్‌ కీ: అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది కీ విడుదల
మెరిట్‌ జాబితా: ఫైనల్‌ కీ విడుదల చేసిన 7 రోజుల తర్వాత విడుదల

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు