విశాలాంధ్ర -ధర్మవరం : మండల పరిధిలోని నేలకోట గ్రామంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచనల మేరకు బోరు పనులను నియోజకవర్గ ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, ధర్మవరం రూరల్ మండలంలోని నెలకోట గ్రామంలో ఎప్పటి నుంచో ఉన్న మంచినీటి కొరతకు శాశ్వత పరిష్కారం లభించనుంది అని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి గ్రామంలో బోరు పనులు ప్రారంభమయ్యాయి అని తెలిపారు. గ్రామ ప్రజలు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యను గుర్తించి, తక్షణమే స్పందించిన ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంబంధిత అధికారులను ఆదేశించడంతో బోరు వేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మంత్రి సత్యకుమార్ యాదవ్ కు, హరీశ్ బాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అదేవిధంగా ప్రధానమంత్రి కిసాన్ విద్యుత్ యోజన (RDSS) ద్వారా గ్రామాల్లో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా కల్పించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా హరీశ్ బాబు సమీక్షించారు. విద్యుత్ లైన్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లు, పునర్నిర్మాణ పనుల పురోగతిని అధికారులచే తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంతో పాటు గృహ వినియోగానికి నిరంతర విద్యుత్ సరఫరా అందించబడుతుంది అని తెలిపారు. ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించేందుకు, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు నేలకోట రాము, బిల్లే శ్రీనివాసులు, సుబ్బారావుపేట పవన్ కుమార్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
నేలకోట గ్రామంలో బోరు పనులు ప్రారంభం
RELATED ARTICLES