Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఇరువురిని పరామర్శించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

ఇరువురిని పరామర్శించిన మంత్రి సత్య కుమార్ యాదవ్

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన కేశగాల్ల శ్రీనివాసు లను, పట్టణములోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ అడహాక్ కమిటీ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాదును మంత్రి స్వయంగా వారి వారి ఇళ్లకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, త్వరగా మీరు కోలుకోవాలని వారికి ధైర్యాన్ని నింపారు. కేశ గాళ్ళ శ్రీనివాసులు రోడ్డు ప్రమాదంలో కాలుకు తగిలిన గాయమును పరిశీలించి, ఎన్డీఏ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా హర్షంవ్యక్తం చేశారు. తదుపరి చెన్నం శెట్టి జగదీశ్వర్ ప్రసాద్ ఓ ఆపరేషన్ తర్వాత, విశ్రాంతి తీసుకున్న సమయంలో మంత్రి రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చెన్నకేశవ స్వామి ఆలయంలో చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడంతో పాటు, తన వంతుగా ఇప్పటికే ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందడం జరిగిందని తెలుపుతూ మంత్రి వారిని అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు