విశాలాంధ్ర ధర్మవరం/బత్తలపల్లి: ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి మండలంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు బుధవారం సందర్శించారు. ఈ సందర్శనలో విద్యార్థులతో సమావేశమై, వారి సమస్యలు, విద్యార్థుల భోజన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని వంటశాలలను, తరగతి గదులను పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. విద్యార్థుల సౌకర్యం కోసం, మంత్రి సత్య కుమార్ యాదవ్ గారి చొరవతో కోకోకోలా కంపెనీ ద్వారా పాఠశాలలో నిర్మించబడుతున్న టాయిలెట్లను పరిశీలించారు. ఈ సందర్భంలో విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని హరీష్ బాబు సూచించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలకు భోజనశాల అవసరమని కోరారు. దీనికి సంబంధించి, హరీష్ బాబు వెంటనే స్పందించి సర్వశిక్షా అభియాన్ ఏపీసీ దేవరాజ్ తో మాట్లాడి, భోజనశాల నిర్మాణానికి అవసరమైన కొటేషన్ సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్శనలో హరీష్ బాబు, విద్యావిధానంలో ఉన్న పరిస్థితులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సుధాకర్ నాయక్, బిజెపి కన్వీనర్ ఆకులేటి భాస్కర్, కావేటి మల్లికార్జున, డి. చెర్లోపల్లి నారాయణస్వామి, కప్పల సుదర్శన్,పోతుకుంట రాజు, బిల్లె శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సందర్శించిన మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరీష్ బాబు
RELATED ARTICLES