విశాలాంధ్ర-పార్వతీపురం: డాక్టర్ బి.ఆర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారంనాడు ముంబైలోని చైత్యభూమివద్దఉన్న బాబు సాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పార్వతీపురంఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పూలమాలలువేసి ఘన నివాళులర్పించారు. పార్వతీపురం నుండి నేరుగా ఆయన ముంబాయి వెళ్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తో కలిసి ఈవేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విజయ్ చంద్ర మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సమాజానికి చేసిన సేవలు మరువరానివన్నారు.బడుగు, బలహీన, అణగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా అంబేద్కర్ చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయారన్నారు. భారత రాజ్యాంగంలో ఈయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఈయన దేశానికి చేసిన సేవను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు..అంబేద్కర్ గొప్ప మేధావి, ఆర్థిక శాస్త్రవేత్త, సంఘ సంస్కర్త, రాజనీతిజ్ఞుడనని కొనియాడారు. ఆయన అణగారిన బలహీన వర్గాల అభ్యుదయం కోసం, కులనిర్మూలనకోసం ఎంతగానో పాటుపడ్డారని, దళితుల, గిరిజనులు, బహుజనులు సామాజిక హక్కుల కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి అని, ఆయన సేవలు నేటితరాలవారికి ఆదర్శమన్నారు.
దేశ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలతో, పరస్పర గౌరవంతో వసుధైక కుటుంబంలా కలిసిమెలసి జీవించాలనే దృఢ సంకల్పంతో రాజ్యాంగాన్ని రచించారని, డా. బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలుతో దేశంలో కుల, మత, లింగ విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, సమాన వేతనాలు, సమానత్వంను కల్పించిన మహానీయుడు అని కొనియాడుతూ, గొప్ప విద్యావంతుడని కొనియాడారు.ఆయనస్ఫూర్తిని, త్యాగనిరతిని ఆదర్శంగా తీసుకుని సమ సమాజ స్థాపనకు అందరూ కృషి చేయాలన్నారు.
ముంబైలోని చైత్యభూమి వద్ద డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పించినఎమ్మెల్యే బోనెల
RELATED ARTICLES