రికార్డు సృష్టించిన అభిజయ్ కి ఎమ్మెల్యే అభినందనలు
విశాలాంధ్ర – సీతానగరం: నాలుగేళ్లకే అరుదైన ఘనత సాధించిన అభిజయ్ కి రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. శనివారం సీతానగరం మండలం సీతానగరం సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా సేవలు అందిస్తున్న ఫణి కుమార్ కుమారుడు అభిజయ్ నాలుగు సంవత్సరాల వయస్సులోనే మూడు నిమిషాల 10 సెకెన్ల సమయంలో 197 దేశాల జెండాలను గుర్తించి ప్రపంచ రికార్డు సృష్టించిన బాలుడిని, తల్లిదండ్రులను కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసాధారణ జ్ఞాపకశక్తితో ప్రపంచ రికార్డు సృష్టించడం గొప్ప విషయం అని అన్నారు. బాలుడి ప్రతిభకు గాను కలామ్స్ వరల్డ్ రికార్డును, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అభిజయ్ అవార్డును సొంతం చేసుకున్నందుకు అభినందనలు తెలిపారు. అలాగే బాలుడి టాలెంట్ ను గుర్తించి ప్రోత్సహిస్తున్న తల్లితండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ బాలుడు జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సీతానగరం సొసైటీ అధ్యక్షుడు మట్టా వెంకటేశ్వరరావు, మాజీ డీఎస్పీ కడలి వెంకటేశ్వరావు, అడపా శ్రీనివాస్ పాల్గొన్నారు.


