Thursday, January 30, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎమ్మెల్యే జయరాం వ్యాఖ్యలు అప్రజాస్వామికం.వ్యతిరేక వార్తలు రాస్తే దౌర్జన్యం చేస్తారా?

ఎమ్మెల్యే జయరాం వ్యాఖ్యలు అప్రజాస్వామికం.వ్యతిరేక వార్తలు రాస్తే దౌర్జన్యం చేస్తారా?

ఏపీయూడబ్ల్యుజే ధర్మవరం రెవెన్యూ డివిజన్ ఖండన
విశాలాంధ్ర ధర్మవరం::జర్నలిస్టులపై బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేసిన గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మీడియాకు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఏపీయూడబ్ల్యూజే ధర్మవరం రెవెన్యూ డివిజన్ అధ్యక్షులు జానపాటి మోహన్, ప్రధాన కార్యదర్శి జాంపుల అజయ్ చౌదరి డిమాండ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు అప్రజాస్వామికం ధర్మవరం రెవెన్యూ డివిజన్ ఏపీయూడబ్ల్యూజే తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం అని తెలిపారు.బాధ్యత కలిగిన శాసనసభ్యుడై ఉండి బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడడం దారుణం అని,జరిగిన తప్పులను సరిదిద్దుకోవాల్సిందిపోయి, వ్యతిరేక వార్తలు రాసిన విలేకరులను రైలు పట్టాలపై పడేయాల్సి వస్తుందని హెచ్చరించడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే అంశం అని మండి పడ్డారు. దీనిని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వెంటనే పాత్రికేయులకు క్షమాపణ చెప్పి తమ తప్పును సరిదిద్దుకోవాలి అని తెలిపారు.ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు పాత్రికేయుల మధ్య సమన్వయం, సామరస్యం చాలా అవసరం అని తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే జయరాం గ్రహించాలి అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు