విశాలాంధ్ర నందిగామ:-క్రమశిక్షణ, దాతృత్వం,ధార్మిక,చింతనల మేలు కలయిక-పవిత్ర రంజాన్ విశిష్టత అని ప్రభుత్వ విప్ నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య అన్నారు పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం'(రంజాన్) పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు ఆమె పట్టణంలోని ఈద్గా,పెద్ద మసీదు వద్ద జరిగిన ప్రార్థనలో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులకు ఆమె మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారితో కలిసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇమాన్ నమాజ్ రోజా జకాత్ హజ్ అనేవి ఇస్లాం మతానికి మూల స్తంభాలన్నారు ఈ ఐదు సూత్రాలను రంజాన్ మాసంలో పాటించడం గొప్ప అవకాశం గా ముస్లింలు భావిస్తారని ప్రతి మతానికి ఓ మూల గ్రంథం ఉంటుందని ఈ గ్రంథంలో మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఉంటాయన్నారు ముస్లింలలోని ముస్లింలందరికి పవిత్ర ఖురాన్ మార్గదర్శకమైందన్నారు అలాంటి కురాన్ ఆవిష్కృతమైన సందర్భమే పవిత్ర రంజాన్ అని తెలియజేశారు ముస్లిం సోదరులకు మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు….
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సౌమ్య….
RELATED ARTICLES