Monday, April 7, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమొబైల్ మెడికేర్ మిషన్ ఆసియాలోనే తొలిసారిగా అందించబడుతున్న ప్రత్యేకమైన సేవ

మొబైల్ మెడికేర్ మిషన్ ఆసియాలోనే తొలిసారిగా అందించబడుతున్న ప్రత్యేకమైన సేవ

— ఎంపీ బీకే పార్థసారథి
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం నియోజకవర్గం లోని బత్తలపల్లి మండలంలో హాస్పిటల్ ఆన్ వీల్స్ అనే వైద్య శిబిరాన్ని ఎంపీ. పార్థసారథి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గంలో ఇటువంటి వైద్యశిబిరాలు నిర్వహించడం ప్రజలకు ఎంతో ఉపయోగముతో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా చేకూరుతాయని తెలిపారు. ఓ అత్యవసర పనిమీద ఆరోగ్య శాఖామంత్రి ముఖ్యమంత్రి పిలుపుమేరకు వెళ్లడం జరిగిందని తెలిపారు. మొబైల్ మెడికేర్ మిషన్ ను వారు ప్రారంభించి, ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రజలకు అంకితం చేశారు. ఇది ఆసియాలోనే తొలిసారిగా అందించబడుతున్న ప్రత్యేకమైన సేవ అని తెలిపారు. ఈ శిబిరం రాష్ట్ర ఆరోగ్యశాఖ సహాయముతో నిర్వహించడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. ఈ శిబిరంలో ప్రత్యేక వైద్య సేవలు ఆధునిక నిర్ధారణ పరికరాలతో అందించడం శుభదాయకం అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఆరోగ్య రథం అనే పేరుతో సేవలను మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల వరకు చేరేలా తయారు చేయబడింది అని తెలిపారు. శిబిరంలో వైద్య చికిత్సలతో పాటు మందులు కూడా పంపిణీ చేయడం జరిగిందన్నారు. నిపుణుల వైద్య బృందాల ద్వారా ఉచిత వైద్య పరీక్షలు ఓపిడి, ఎక్సిరే సేవలు, లాబరేటరీ పరీక్షలు, సాధారణతో పాటు కంటి స్క్రీనింగులు, ముక్కు, నాడి, ఎన్సీడీ స్క్రీనింగ్ కూడా అందించడం జరిగిందన్నారు. కార్పొరేట్ హాస్పిటల్ కు దీటుగా ఈ శిబిరాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయం అన్నారు. అంతేకాకుండా నేడు భారతదేశ ప్రపంచవ్యాప్తంగా కొత్త తరహా వైద్య సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోనే వైద్య శాఖలో పెను మార్పులను తీసుకొని వచ్చేందుకు నాటి ఎన్డీఏ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. కార్పొరేట్ హాస్పిటల్కు ధీటుగా నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను పేద ప్రజలకు అందించేందుకు మంత్రి తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. తదుపరి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు కూడా వారు తెలియజేశారు. మంత్రి కొన్ని అనివార్య కారణాల వలన ఈ శిబిరానికి రాలేకపోయారని వారు తెలిపారు. మంగళవారం తాడిమర్రి మండలంలో యధాప్రకారం శిబిరం కు మంత్రి హాజరవుతారని తెలిపారు. ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత కేల్ ఇండియా అని ఫిట్ ఇండియా అని మన ప్రాచీరమైన యోగ ఏదైతే ఉందో జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం గా ప్రకటన చేయడం జరిగిందన్నారు. ఆరోగ్యానికి యోగా కూడా ఎంతో అవసరమని తెలిపారు. నియోజకవర్గంలో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహణలో పేద ప్రజలకు ఆరోగ్య విషయంలో మెలకువలను తెలుపుతూ వైద్య చికిత్సలను అందించడం శుభదాయకమైనది అని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్య విషయంలో ఇటువంటి శిబిరాలు నిర్వహణ అందరికీ ఆమోదయకరమైనదిగా ఉందని తెలిపారు. నేడు ప్రజలు తమ ఆరోగ్య విషయంలో కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే మెరుగైన సేవలు అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. అడ్వాన్స్ టెక్నాలజీలతో ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. క్యాన్సర్, హార్ట్ ఎటాక్ తదితర జబ్బులకు కూడా మెరుగైన వైద్యమును అందించేందుకు వైద్యశాఖ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధులకు, అత్యవసరమైన వ్యాధులకు ప్రభుత్వ వైద్యశాలతో పాటు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం అందించేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రోగులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని తెలిపారు. ఇవాళ ఒక విజినరీ లీడర్ గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో గత ఐదు సంవత్సరాలుగా ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ రూపంలో ఆరోగ్యాన్ని పరుగులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఈ రాష్ట్రంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు కూడా తప్పకుండా వస్తాయని వారు స్పష్టం చేశారు. ఆరోగ్యశాఖ మంత్రి తరఫున వైద్యులకు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో, డిప్యూటీ డిఎంహెచ్వో, మెడికల్ కోఆర్డినేటర్ ప్రదీప్, దయాకర్, బిజెపి మండల అధ్యక్షులు ఆకులేటి భాస్కర, టిడిపి మండల కన్వీనర్ నారాయణరెడ్డి, గోనుగుంట్ల విజయ్ కుమార్, మహేష్ చౌదరి, కోటి బాబు, ఆకులేటి వీరనారప్ప, కావేటి మల్లికార్జున, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ సురేంద్రనాయుడు, సతీష్, నెట్టం రమణ, ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు వివిధ విభాగాల వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది, ఎన్డీఏ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు