చీఫ్ సూపర్డెంట్, పద్మశ్రీ,, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల మోడల్ హైస్కూల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలు సజావుగా నిర్వహించడం జరిగిందని చీఫ్ చూపెట్టెంట్ పద్మశ్రీ, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఈఓ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలో మోడల్ హై స్కూల్ (ఆదర్శ) లో ఆరవ తరగతి చేరేందుకు గాను ప్రవేశ పరీక్షలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. మొత్తం 11 గదులలో 11 మంది ఇన్విజిలేటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 265 మంది విద్యార్థులకు గాను 234 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగిందని, 31 హాజరు కాలేదని తెలిపారు. దీంతో 88 శాతము హాజరు కావడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రంలో మెడికల్, తాగునీటి సౌకర్యంతో పాటు, పోలీస్ లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తదుపరి జిల్లా కేంద్రం ద్వారా ఆరవ తరగతికి అర్హత సాధించిన వారి జాబితాను ప్రకటించడం జరుగుతుందని తెలిపారు.
సజావుగా మోడల్ స్కూల్ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షలు
RELATED ARTICLES