Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యార్ది నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబును అరెస్టు చేయాలి

విద్యార్ది నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబును అరెస్టు చేయాలి

- Advertisement -

–పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర
విశాలాంధ్ర ధర్మవరం:
సినీ నటుడు మోహన్ బాబు గుండాలచే విద్యార్థి నాయకులపై దౌర్జన్యం చేసి కిడ్నాప్ చేయడం దుర్మార్గ చర్య అని ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర పేర్కొన్నారు. అనంతరం మంజుల నరేంద్ర మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి వెళుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ఎఫ్ఐ ఎస్వీ యూనివర్సిటీ నాయకుడు వినోదులపై కలెక్టర్ కార్యాలయం వద్ద సినీ నటుడు మోహన్ బాబు అనుచరులుగా ఉన్న 30 మంది వాహనాలలో వచ్చి అమానుషంగా వీరిపై దాడికి పాల్పడడమే కాకుండా తమ వెంట తెచ్చుకున్న వాహనాలలో వీరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారన్నారు.మోహన్ బాబు యూనివర్సిటీలో గతంలో అనేక అక్రమాలు జరిగాయని, వాటిని వెలుగులోకి తీసుకొస్తున్న విద్యార్థి నేతలపై దాడులకు పాల్పడడం ఏ రకమైన సంస్కృతికి నిదర్శనమని వారు ప్రశ్నించారు.విద్యార్థి నాయకులకు అపాయం తలపెడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. తప్పులు సరిదిద్దుకోమంటే దాడికి పాల్పడతారా అని వారు ప్రశ్నించారు. పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, లేని పక్షంలో మోహన్ బాబుకు తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీ లో అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని వెలికి తీయాలని,విద్యార్థులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు