సినీ నటుడు మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైదరాబాద్ జల్లపల్లిలో ఆయన ఇంటి వద్ద జరిగిన ఘటనల కేసులకు సంబంధించి ఆయన బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఆస్తుల విషయంలో ఇటీవల మోహన్‌బాబు ఫ్యామిలీలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆస్తుల కోసం మంచు విష్ణు, మనోజ్ మధ్య పెద్ద పంచాయతీనే జరిగింది. జల్లపల్లి నివాసంలో మంచు మనోజ్ వెళ్లేందుకు ప్రయత్నించడం, మంచు విష్ణు అనుచరులు అడ్డుకోవడం, స్థానిక ఫుటేజ్ మాయం కావడం, న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో మంచు మోహన్ బాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
రెండు కేసుల్లో బెయిల్ కోసం పిటీషన్
మోహన్‌బాబుపై నమోదైన కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు. ఈ రెండు కేసులకు సంబంధించి పిటీషన్ వేశారు. గతంలో మోహన్ బాబు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.