Homeజాతీయంనా పెళ్లి లవ్ జిహాద్ కాదు..

నా పెళ్లి లవ్ జిహాద్ కాదు..

- Advertisement -

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా భోంస్లే
కేరళలోని ఆలయంలో ఫర్మాన్ ఖాన్‌ను వివాహం చేసుకున్న మోనాలిసా
ఇద్దరం మతాలు మార్చుకోలేదని చెప్పిన నూతన దంపతులు
తండ్రి నుంచి రక్షణ కోరుతూ పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పూలదండలు అమ్ముతూ తన ఆకర్షణీయమైన కళ్లతో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సంచలనంగా మారిన యువతి మోనాలిసా భోంస్లే తన పెళ్లిపై వస్తున్న వదంతులను ఖండించారు. తాను ఫర్మాన్ ఖాన్‌ను హిందూ సంప్రదాయాల ప్రకారమే వివాహం చేసుకున్నానని, దీనికిలవ్ జిహాద్ కోణాన్ని ఆపాదించడం సరికాదని స్పష్టం చేశారు. పెళ్లి అనంతరం ఇవాళ‌ కేరళలో తన భర్తతో కలిసి ఆమె తొలిసారిగా మీడియా ముందుకు వచ్చారు.

కేరళలోని అరుమనూర్ ఆలయంలో నిన్న‌ ఫర్మాన్ ఖాన్‌తో మోనాలిసా వివాహం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా పెళ్లి హిందూ ఆచారాల ప్రకారం జరిగింది. ఇది లవ్ జిహాద్ కాదు. నేను అన్ని మతాలను గౌరవిస్తాను, ప్రతీ మతాన్ని సమానంగా చూస్తాను అని తెలిపారు. తామిద్దరూ తమ తమ మతాలను మార్చుకోలేదని ఆమె భర్త ఫర్మాన్ ఖాన్ కూడా స్పష్టం చేశారు. దీంతో ఈ వివాహంపై జరుగుతున్న ప్రచారానికి వారు తెరదించారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసా, ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో పూలు, గాజులు అమ్ముతున్న వీడియోలతో దేశవ్యాప్తంగా పాప్యులర్ అయ్యారు. సామాన్య యువతిగా ఉన్న ఆమె, ఇంటర్నెట్ ద్వారా వచ్చిన కీర్తితో సినిమా అవకాశాలను అందుకున్నారు. దర్శకుడు సనోజ్ మిశ్రా ఆమెను గుర్తించి ఃది డైరీ ఆఫ్ మణిపూర్ః అనే చిత్రంలో నటిగా అవకాశం ఇచ్చారు. దీనికోసం ఆమె ఇండోర్‌లో నటనలో శిక్షణ తీసుకుని, వృత్తిపరంగా సినిమా రంగంలో స్థిరపడేందుకు ముంబైకి మకాం మార్చారు.

అయితే, ఇటీవల మోనాలిసా వ్యక్తిగత జీవితంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన తండ్రి తన ఇష్టానికి విరుద్ధంగా బలవంతంగా తిరిగి ఇండోర్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, కేరళలోని తంపనూర్ పోలీస్ స్టేషన్‌లో ఆమె రక్షణ కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె వివాహం చేసుకోవడం గమనార్హం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు