విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా ): ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా కొయ్యలగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తస్లీమా ఆధ్వర్యంలో ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ తస్లీమా మాట్లాడుతూ దోమ కుట్టడం వల్ల మలేరియా జ్వరం వస్తుందని, దీనిని అరికట్టడానికి ప్రభుత్వ పరంగా ప్రతీ శుక్రవారం డ్రైడే-ఫ్రైడే నిర్వహిస్తూ,ప్రతి ఇంటి వద్ద దోమలు నిల్వలు లేకుండా దోమ లార్వా ను నిర్మూలించడానికి యాంటీ లార్వా మందులను పిచికారీ చేయిస్తున్నామని పేర్కొన్నారు.ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీరు నిల్వలు లేకుండా చూసుకోవాలని, తద్వారా మలేరియా వ్యాధి ప్రబలకుండా అరికట్టవచ్చని,దోమల వ్యాప్తిని అరికట్టడానికి మనకు అందుబాటులో ఉండే వేప ఆకులను కాల్చి పొగ పెట్టటం ద్వారా దోమల వ్యాప్తిని నిరోధించవచ్చునని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సి.హెచ్.వొ నూనే నాగమణి,పి.హెచ్.ఎన్ సుభద్రా దేవి,ఎం.పి.హెచ్.ఎస్ మంగారావు, హెల్త్ అసిస్టెంట్లు జానకి రామ రాజు,తులసి క్రృష్ణ,శివయ్య,ప్రసాదు,ఏ.ఎన్.ఎమ్,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు