Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమాతృభాషను కాపాడుకోవాలి..

మాతృభాషను కాపాడుకోవాలి..

కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం,:: బిడ్డ అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాషను కూడా కాపాడుకోవాలని కరెస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ హర్షవర్ధన్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు శుక్రవారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ కరణం హర్ష వర్ధన్లు గాంధీ , గిడుగు రామమూర్తి పంతులు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి, డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ మనిషి జీవితంలో మొదట నేర్చుకునేది మాతృభాష అని తన తల్లిని ఎవరూ చెప్పకుండానే అమ్మా అని బిడ్డ ఏవిధంగా పిలుస్తాడో మాతృభాష కూడా అలాంటిదేనని, అందుకే బిడ్డ అమ్మను కాపాడుకున్నట్లే మాతృభాషను కూడా కాపాడుకోవాలి అని వారు పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ మాట్లాడుతూ జీవితంలో పైకి ఎదగాలంటే ఇతర భాషలను నేర్చుకోక తప్పదనీ,ఇతర భాషలను నేర్చుకోవడంలో ఎలాంటి తప్పులేదు కానీ వాటి ప్రభావం మాతృభాషపై పడకుండా జాగ్రత్తలు పడాలి అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి రమేష్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు