హిందూపురం జి ఆర్ పి పోలీసులు
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని శ్రీ3 కేతిరెడ్డి కాలనీలో నివాసము ఉండు మున్సిపల్ వర్కర్ ఆశాది లక్ష్మీదేవి (34) అనారోగ్యంతో మృతి చెందినట్లు హిందూపురం జిఆర్పి పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జిఆర్పి కానిస్టేబుల్ ఎర్రి స్వామి, లక్ష్మీనారాయణ, భాస్కర్ మాట్లాడుతూ మృతి చెందిన మహిళకు పలు రకాలుగా అనారోగ్యాలకు గురి కావడం జరిగిందని, అప్పుడప్పుడు కుటుంబ కలహాలు కూడా జరిగేటివి అని వారు తెలిపారు. ఈనెల మూడవ తేదీ రాత్రి తన ఇంటి వద్ద నుండి బయటికి వెళ్లిపోయిందని, అనంతరం మంగళవారం ఉదయం ఎల్ త్రీ కేతిరెడ్డి కాలనీ రైలు పట్టాల వద్ద శవమై పడి ఉన్న దృశ్యాన్ని చూసి స్థానికులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తదుపరి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించడం జరిగిందని, అనంతరం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, సవ పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించడం జరిగిందని తెలిపారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. మృతురాలకు భర్త కుల్లయప్ప తో పాటు కూతురు మీనాక్షి, కుమారుడు పురుషోత్తం కలరు.
అనారోగ్యంతో మునిసిపల్ వర్కర్ రైలు కింద పడి మృతి..
RELATED ARTICLES