Wednesday, January 21, 2026
Homeభగవంత్‌ కేసరికి జాతీయ అవార్డు

భగవంత్‌ కేసరికి జాతీయ అవార్డు

- Advertisement -

ఉత్తమ చిత్రం ట్వల్త్‌ ఫెయిల్‌
నటులు షారుక్‌ ఖాన్‌, విక్రాంత్‌, రాణీ ముఖర్జి
బలగం, హనుమాన్‌, బేబీకి పురస్కారాలు
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన

న్యూదిల్లీ: జాతీయ ఉత్తమ చిత్రంగా ట్వల్త్‌ ఫెయిల్‌, ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్‌ కేసరికి అవార్డులు దక్కాయి. జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన జ్యూరీ కమిటీ…ఫలితాల జాబితాను కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు అందజేసింది. 15 విభాగాల్లో అవార్డులు ప్రకటించారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును షారుక్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మస్సే (ట్వల్త్‌ ఫెయిల్‌) పంచుకున్నారు. ‘మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ (హిందీ) చిత్రానికిగాను ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకుడిగా ‘ది కేరళ స్టోరీ’ని తెరకెక్కించిన సుదీప్తో సేన్‌ అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ యాక్షన్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ)లో ‘హనుమాన్‌’ చిత్రం అవార్డు దక్కించుకోగా, ఉత్తమ గేయ రచయితగా ‘బలగం’లో ‘ఊరు పల్లెటూరు’ పాటకు కాసర్ల శ్యామ్‌ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు బేబీ చిత్రంలోని ప్రేమిస్తున్నా… పాటకుగాను పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ను వరించింది. అలాగే, ఉత్తమ తమిళ చిత్రంగా ‘పార్కింగ్‌’ను పురస్కారం వరించింది. ఉత్తమఫిల్మ్‌ క్రిటిక్‌ అవార్డు ఉత్పల్‌ దత్త (అస్సామీ)కు దక్కింది. ఉత్తమ సహాయ నటుడు: పూక్కాలం (మలయాళం) విజయ రాఘవన్‌, పార్కింగ్‌ (తమిళ్‌) ముత్తుపెట్టాయ్‌ సోము భాస్కర్‌, ఉత్తమ సహాయ నటి: ఉళ్లోలుక్కు (మలయాళం) ఊర్వశి, వష్‌ (గుజరాతీ) జానకీ బోడివాలా, ఉత్తమచైల్డ్‌ ఆర్టిస్ట్‌: గాంధీతాత చెట్టు (తెలుగు) సుకృతివేణి, జిప్సీ (మరాఠీ) కబీర్‌ ఖండారీ, నాల్‌ 2 (మరాఠీ) త్రిష థోసర్‌, శ్రీనివాస్‌ పోకలే, భార్గవ్‌ జగ్దీప్‌Ñ ఉత్తమ నేపథ్య గాయకుడు: బేబీ (ప్రేమిస్తున్నా..) పీవీఎన్‌ ఎస్‌ రోహిత్‌, ఉత్తమ నేపథ్య గాయని: జవాన్‌ (చెలియా) శిల్పారావు, ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది కేరళ స్టోరీ (హిందీ) పసంతను మొహపాత్రో, ఉత్తమ సంభాషణలు: సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (హిందీ) దీపక్‌ కింగ్రానీ, ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): పార్కింగ్‌ (తమిళ్‌) రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌, బేబీ (తెలుగు) సాయి రాజేశ్‌ నీలం, ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: యానిమల్‌ (హిందీ) సచిన్‌ సుధాకరన్‌, హరి హరన్‌ మురళీ ధరన్‌, ఉత్తమ ఎడిటింగ్‌: పూక్కాలమ్‌ (మలయాళం) మిథున్‌ మురళి, ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: 2018 (మలయాళం) మోహన్‌దాస్‌, ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సామ్‌ బహదూర్‌ (హిందీ), ఉత్తమ మేకప్‌: సామ్‌

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు