దర్శనమల మెడికల్ ఆఫీసర్లు పుష్పలత, దిలీప్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం : మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కునుతూరు, గొట్లూరు నైరా పాఠశాలను, బత్తలపల్లి మండలంలోని ఎంజే పి బి సి స్కూలులో ధర్మవరం డివిజన్ డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ సెల్వియా సల్మాన్ నేషనల్ డి వార్మింగ్ డే సందర్భంగా మాత్రలను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగిందని మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పుష్పలత, దిలీప్ కుమార్ ను తెలిపారు. అదేవిధంగా విద్యార్థులలో నులిపురుగులు ఎలా వస్తాయి? రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? అన్న విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు రాజశేఖర్ రెడ్డి, జై తుంబి, హెల్త్ అసిస్టెంట్లు ఆంజనేయులు, ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
ఘనంగా నేషనల్ డి వార్మింగ్ డే..
RELATED ARTICLES