- Advertisement -
విశాలాంధ్ర – గోపాలపురం : రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారుల విస్తరణకు ప్రజలు సహకరించాలని ఆర్ అండ్ బి అధికారులు ప్రజలను కోరారు. సోమవారం మండలంలోని దొండపూడి గ్రామంలో నేషనల్ హైవే 365 బిబి విస్తరణ పనులను వారు పరిశీలన చేసి మార్కింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హైవే ఆర్ అండ్ అధికారులు స్థానిక ప్రజలతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రహదారులను విస్తరించే పనిలో ప్రభుత్వం ఉందని అందుకు ప్రజలు సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.


