Monday, May 12, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయి20న దేశవ్యాప్త కార్మిక సంఘం సమ్మె నోటీసు..

20న దేశవ్యాప్త కార్మిక సంఘం సమ్మె నోటీసు..

సిఐటియు నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; మే 20వ తేదీన దేశవ్యాప్త కార్మిక సంఘం సమ్మె సందర్భంగా మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కు సమ్మె నోటీసులు సిఐటియు నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ జె వి రమణ, కో కన్వీనర్ టి. అయూబ్ ఖాన్, సంఘం అధ్యక్ష, కార్యదర్శులు యం. బాబు, ముకుంద మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను కుదించడం దారుణమన్నారు. ముఖ్యంగా నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, సుమో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్ అవర్స్ హౌసింగ్ విధానం రద్దుచేసి కార్మికులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంస్థలను కాపాడాలని ,ప్రైవేటీకరణ రద్దు చేయాలని, తదితర ప్రధానమైన డిమాండ్లతో సిఐటియు ఇతర ప్రజా సంఘాలతో ఈ నెల 20 తారీకున దేశవ్యాప్త సమ్మెను కొనసాగిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా 21, 22 రెండు రోజులపాటు రాష్ట్ర వ్యాప్త కార్మిక సమ్మెను కొనసాగిస్తున్నామని,ఆ సమ్మెకు అధికారులు సహకరించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రసాద్, చెన్నకేశవులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు