విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా): చోడవరం ఎక్సైజ్ ప్రొహిబిషన్ స్టేషన్ పరిధిలో కె.కోటపాడు మండలం కొరువాడ గ్రామంలో చోడవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె.వి పాపు నాయుడు ఆధ్వర్యంలో నాటు సారా, మత్తు పదార్థాలు వాడకం, అమ్మకంపై శుక్రవారం అవగాహన కల్పించారు. నాటు సారా ప్రాణాలకు హాని చేస్తాయని, గ్రామ ప్రజలు ఎవరూ కూడా నాటు సారాయి తయారు చేయడం, సేవించడం అమ్మకం చేయకూడదని, చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని తెలియజేశారు. నాటు సారా తయారుచేసే 25 మందిని గుర్తించి, గ్రామ పెద్దల సమక్షంలో నాటు సారా తయారీ మరియు అమ్మకాలు చేసే వారితో ఇక పైనుండి ఎప్పుడూ కూడా నాటు సారాయి అమ్మకముగాని తయారీ గాని చేయమని ప్రతిజ్ఞ చేయించారు. సారా తయారీదారులను తహసిల్దార్ వద్ద బైండోవర్ చేస్తామని తెలిపారు. అదే విధంగా గ్రామ ప్రజలకు నాటు సారాయి తాగడం వలన కలిగే ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కొరువాడ గ్రామ సర్పంచ్ నారాయణమూర్తి, ఎంపీటీసీ అచ్చి బాబు, గ్రామ కార్యదర్శి, మహిళా సంరక్షణ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.