Friday, May 23, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిస్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం

స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధ్వజం
విశాలాంధ్ర ధర్మవరం;; ఉపాధి హామీ పథకం పనుల్లో జరుగుతున్న అవినీతిని తాము అడ్డుకుంటామని, స్థానిక సంస్థలను ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని అంటూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైఎస్ఆర్సిపి పంచాయితీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు తమ నివాసం వద్ద నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులు ముఖ్య నేతలతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బోగస్ మస్టర్లతో అక్రమాలు జరుగుతున్నాయని, కూటమి నేతల జోగుల్లోకి కోట్ల నిధులు వెలుతున్నాయని వారు ఆరోపించారు. గ్రామాలలో పనులు లేక కూలీల వలస పోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టిందని, కానీ నేటి ఎన్డీఏ ప్రభుత్వం బోగస్ మాస్టర్లతో కోర్టు స్వాహా చేస్తున్నారని వారు అవినీతిని అడ్డుకోవలసిన అధికారులు తమకేమీ పట్టినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. పంచాయతీల్లో సర్పంచు పాలకవర్గం తీర్మానం లేకుండా ఎవరు పడితే వారు పనులు చేయించడం సమంజసమేనా అని తెలిపారు. ప్రజా ప్రతినిధులకు ఇవ్వాల్సిన గౌరవం కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి దందా ప్రత్యేక పోతుందని కేతిరెడ్డి తెలిపారు. ఇసుక తరలిపోతున్న అధికారులు నిమ్మకుండడం పద్ధతి కాదని తెలిపారు. సమావేశంలో హాజరైన వారికి ఉపాధి నిధులు దారి మళ్లింపు, స్థానిక సంస్థల నిర్వీర్యం పై పోరుబాటుకు దిశా నిర్దేశం చేశారు. అంతేకాకుండా అవినీతిని ప్రోత్సహిస్తున్న అధికారులపై చట్టపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. స్థానిక సంస్థలు దగ్గరలో ఉన్నందున పట్టణ, గ్రామీణ స్థాయిలో వైఎస్ఆర్సిపి ను బలోపితం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి వివిధ అనుబంధ కమిటీ నాయకులు, సభ్యులు, జడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు