విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో మే నెల రెండవ వారం నిర్వహించబోయే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాలను నిర్వహణ ఏర్పాట్లను ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అడ్హక్ చైర్మన్ చెన్నం శెట్టి జగదీష్ ఆలయ అర్చకులు, సిబ్బంది హరీష్ బాబుకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి పేరిటన అర్చకులు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఆవరణం లోని గదులను వారు పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు, పౌర్ణమి గరుడ సేవలకు, ఇతరత్రా హిందువుల ముఖ్యమైన పండుగలకు ఉపయోగించే రథము, ఉత్సవ విగ్రహాలు, ఊరేగింపుకు వినియోగించే విగ్రహాలు తదితర వాటిని వారు పరిశీలించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు సంతృప్తికరంగా జరుగుతున్నట్లు వారు ప్రకటించారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరుగుటకు సత్య కుమార్ ఆదేశాల మేరకు తమ వంతుగా కూడా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆలయంలో జరుగుతున్న పెయింటింగ్ పనులు, శుభ్రత పనులను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల వేడుకలు అడ్ హక్ చైర్మన్ చెన్నం శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో మంత్రి ఆదేశాల మేరకు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని తెలిపారు. వందల సంవత్సరాల కిందట గల ఈ గుడి నేడు ధర్మవరం ప్రజలను కాపాడుతోందని తెలిపారు. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది అని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో మన ధర్మవరం చెన్నకేశవ స్వామి ఆలయం ఎంతో గుర్తింపు ఉంది అని తెలిపారు. బ్రహ్మోత్సవ వేడుకల ఏర్పాట్లను మరింత వేగవంతంగా పనిచేసేందుకు కృషి చేయాలని చైర్మన్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు ఇంకా చంద్రశేఖర్, సాకే ఓబులేసు, తలారి వరప్రసాద్, కొత్తపాలెం హరి, అర్చకులు, భక్తాదులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎన్డీఏ కార్యాలయ మంత్రి ఇన్చార్జ్ హరీష్ బాబు
RELATED ARTICLES