Wednesday, April 16, 2025
Homeజిల్లాలుశ్రీకాకుళంపర్యాటక రంగం  అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి

పర్యాటక రంగం  అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి

నక్షత్ర హోటల్స్ ఏర్పాటుకు సాధ్యసాధ్యాలు పరిశీలించండి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

సంతబొమ్మాళి (శ్రీ‌కాకుళం ) పర్యాటక రంగానికి పరిశ్రమ హోదాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సంబంధిత రంగాన్ని జిల్లాలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
ఆదేశించారు. బుధవారం కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్..లో పర్యాటక శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, మార్గ నిర్దేశం చేశారు. టెక్కలిలో పట్టు మహాదేవ్ కోనేరు, భావనపాడు బీచ్, కొత్తపేట కొండ, వీటితోపాటే టెక్క‌లిలో దివంగత నేత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు పేరిట నెల‌కొల్పిన పార్కు అభివృద్ధికి చ‌ర్య‌లు చేప‌డుతూ స‌మగ్ర ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌ని ఆదేశించారు. నక్షత్ర హోటల్స్ ఏర్పాటు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఆయా ప్రాంతాలను స్వయంగా పరిశీలించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఒక మంచి వాతావరణం ఉండే విధంగా గ్రీనరీ, చిన్నారులు ఆడుకునేందుకు పార్కు, వంటివి సదుపాయాలు ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన ప్రాంతాలకు పర్యటనకు వచ్చేవారంతా ఆనందాలను పంచుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సమావేశంలో ఈఈ రమణ,జెఈ మన్మధరావు, జిల్లా పర్యాటక అధికారి నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు